కేంద్రం నిర్ణయంపై జడ్చర్ల బీజేపీ నేత హర్షం

తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ కింద 2 లక్షల ఇళ్లను కేటాయించడంపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లను పారదర్శకంగా కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.



