తాండూరులో మరో ఆధార్ కేంద్రం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పోస్టాఫీసులో మరో ఆధార్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీంతో పట్టణంలో రెండు కేంద్రాల ద్వారా ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. 0–5 ఏళ్ల చిన్నారులకు కొత్త ఆధార్ నమోదు ఉచితంగా చేస్తారు. 5–17 ఏళ్ల వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ ఈ నెల 30వ తేదీ వరకు ఉచితం. అనంతరం మొదటిసారి బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితంగా ఉండగా, రెండోసారి రూ.125 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ఆధార్ సేవలకు రూ.75 రుసుము ఉంటుందన్నారు.



