అభివృద్ధికి దూరంగా బొంతువలస

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని బొంతువలస గ్రామం ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలైన CC రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు కూడా ఏర్పాటు కాలేదని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని పేర్కొన్నారు. దీంతో వర్షాకాలంలో రాకపోకలు, పారిశుద్ధ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.



