అంగన్వాడీ ఉత్సవాల్లో పోషకాహారంపై అవగాహన

కర్నూలు జిల్లా గూడూరు మండలం తిరువెంగళాయపల్లి అరుంధతివాడలో అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సూపర్‌వైజర్ చెంచులక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ICDS CDPO ఎస్.కె. మహబూబి పాల్గొని తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. పిల్లలు, తల్లులు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలు అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.


