← Back to news

శతాధిక వృద్ధుడి మృతి

By Bejjanki· 2h ago· Bejjanki, Bejjanki, Siddipet
శతాధిక వృద్ధుడి మృతి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. శతాధిక వయసు వరకు జీవించి మూడు తరాలను చూసిన అన్నాడి కృష్ణారెడ్డి 105 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు, మనుమలు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కృష్ణారెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

More in Local