← Back to news

ఎమ్మెల్యే సర్ప్రైజ్ చెక్.. ఆసుపత్రి అంతా OKనా?

By Srinivas· 4d ago
ఎమ్మెల్యే సర్ప్రైజ్ చెక్.. ఆసుపత్రి అంతా OKనా?

అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ సోమవారం నాడు పదర మండల ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. వార్డులు, ఔట్ పేషెంట్ విభాగం, ఫార్మసీ – అన్నీ చూశారు. మందులు ఉన్నాయా? సిబ్బంది హాజరు ఎలా ఉంది? పారిశుద్ధ్యం బాగుందా? అని అడిడి తెలుసుకున్నారు. ప్రతీ డీటెయిల్ పరిశీలించారు. పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి చెప్పారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీ ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయి? మందులు అందుబాటులో ఉన్నాయా? కామెంట్ షేర్ చేయండి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.