హైదరాబాద్‌లో చెత్త సేకరణ ప్రైవేటుకా?

TG: హైదరాబాద్‌లో చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు అధికారులు ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెత్త సేకరణలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించి, మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించినా చెత్త సేకరణపై GHMC పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ విధానంలో చెత్త సేకరణ జరుగుతుండగా, నగరం మొత్తం అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.


