← Back to news

హైదరాబాద్‌లో నీటి బిల్లుల పెంపు

By Anusha· 1h ago
హైదరాబాద్‌లో నీటి బిల్లుల పెంపు

TG: హైదరాబాద్‌లో నీరు, మురుగునీటి చార్జీలు ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది. 2011 తర్వాత నీటి చార్జీల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఖర్చులు పెరిగాయని HMWSSB అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత CURE బిల్లు అమల్లోకి వస్తే ఐదేళ్లలో చార్జీలు సుమారు 25 శాతం వరకు పెరగొచ్చు. ప్రస్తుతం నగరానికి రోజుకు 602 MGD నీరు సరఫరా అవుతుండగా డిమాండ్ 750 MGDగా ఉంది. 20 కిలోలీటర్ల వరకు ఉచిత నీరు పొందుతున్న 5 లక్షల కనెక్షన్లపై ఈ పెంపు ఎలా ఉంటుందనేది ప్రభుత్వం నిర్ణయించాలి.

More in TG