← Back to news

విద్య వైద్య రంగాల సమస్యలను పరిష్కరించాలి

By Bhasker Mamilla· 4d ago
విద్య వైద్య రంగాల సమస్యలను పరిష్కరించాలి

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలతో పాటు విద్యా, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఆర్డీవో అర్చనకు వినతిపత్రం అందించారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

విద్య వైద్య రంగాల సమస్యలను పరిష్కరించాలి

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.