← Back to news

సుంకరమెట్టలో స్వచ్ఛతా హి సేవా ర్యాలీ

By Appalanaidu· 1d ago· Sunkarametta, Araku Valley, Alluri Sitharama Raju
సుంకరమెట్టలో స్వచ్ఛతా హి సేవా ర్యాలీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట గ్రామపంచాయతీలో సోమవారం స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా అవగాహన ర్యాలీ జరిగింది. ఎంపీడీవో వీసం ప్రసాద్, తహసీల్దార్ జి. రాజశ్రీధర్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీ లావణ్య, ఎంఈఓ భారతీరత్నం, ఏటీఓ వెంకట్రావు, పంచాయతీ డెవలప్‌మెంట్ అధికారి పి. శివప్రసాద్ పాల్గొన్నారు. స్వచ్ఛతే సేవ, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్థానికులు, యువత పాల్గొన్నారు.

More in Local