← Back to news

నేలకొండపల్లిలో గ్రామసభ.. పనులపై చర్చ

By K. VENKATESH· 2h ago· Nizampet, Nizampet, Medak
నేలకొండపల్లిలో గ్రామసభ.. పనులపై చర్చ

ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మేజర్ పంచాయతీ కార్యాలయంలో VBGRAMG గ్రామసభ జరిగింది. సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ మద్దినేని మహేష్ హాజరయ్యారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త పనులను అధికారులతో కలిసి గుర్తించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామానికి శాశ్వత ఆస్తుల కల్పనపై చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

More in Local