జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని TUWJ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ వార్నింగ్ ఇచ్చారు. IJU పిలుపుతో నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ తీసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. 1978 తర్వాత డిజిటల్, సోషల్ మీడియాలో చాలా మార్పులొచ్చాయని, వెంటనే నేషనల్ లెవెల్‌లో సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




