← Back to news

పసుపు సాగుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

By Krishna· 2d ago
పసుపు సాగుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP: శ్రీకాకుళం జిల్లా.. సీతంపేట ITDA పరిధిలో గిరిజన రైతుల కోసం 8 వేల ఎకరాల్లో పసుపు సాగుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'పసుపు సాగు విస్తరణ కార్యక్రమం' కింద వచ్చే మూడేళ్లు ఈ సాగు చేపట్టనున్నారు. దీని అంచనా వ్యయం 38 కోట్ల 40 లక్షలు. గిరిజనులకు 75 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇందులో 40 శాతం గిరిజన సంక్షేమ శాఖ, 35 శాతం ఉద్యాన శాఖ.. సబ్సిడీ ఇస్తాయి. రైతులు కేవలం 25 శాతం భరించాలి. తొలి ఏడాదిలో 3 వేల ఎకరాల లక్ష్యం కాగా, ప్రభుత్వం 5 కోట్ల 76 లక్షలు మంజూరుచేసింది.

More in AP