భీమ్గల్లో మహాచండీ హోమం
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని ఇర్రోడి గల్లి వారాహి మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం వద్ద మహాచండీ హోమం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హోమం ముగిసిన తర్వాత భక్తులందరికీ మహా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు.


