కొడుకు టార్చర్ భరించలేక.. తండ్రి షాకింగ్ డెసిషన్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట PS పరిధిలో కొడుకుపై గొడ్డలితో దాడిచేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కపేటకు చెందిన రాఘవరెడ్డి, కుమారుడు రాజేందర్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు ఎలాంటి పని చేయకుండా తండ్రిని వేధింపులకు గురిచేసేవాడని వెల్లడించారు. ఆగస్టు 8న తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరగగా రాజేందర్, తండ్రిపై దాడి చేయడంతో తీవ్రంగా విసిగిపోయిన రాఘవరెడ్డి, నిద్రిస్తున్న కుమారుడిపై గొడ్డలితో దాడిచేశాడు. గాయపడిన రాజేందర్‌ను వరంగల్ MGM ఆస్పత్రికి తరలించారు.



