← Back to news

మిర్చి యార్డులో మృతదేహం

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మిర్చి యార్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్న స్థితిలో ఉన్నట్లు నల్లపాడు పో్లీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మృతదేహాన్ని గౌరవప్రదంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అలాగే మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

More in Local