ట్రాలీ రోబోట్తో గుర్తింపు.. పార్లమెంట్లో స్పీచ్

AP:ఎన్టీఆర్ జిల్లాకు చెందిన స్టూడెంట్ CH.సుదీక్ష అరుదైన ఘనత సాధించింది. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ‘నో యువర్ లీడర్’ ప్రోగ్రాంలో ప్రసంగించింది. అటల్ టింకరింగ్ ల్యాబ్లో వయోవృద్ధుల కోసం రూపొందించిన ‘ట్రాలీ రోబోట్’ ప్రాజెక్టుకు వచ్చిన గుర్తింపుతో ఈ అవకాశం ఇచ్చారు. జాతీయ నాయకులపై ఆమె చేసిన స్పీచ్ ఆకట్టుకుంది. పార్లమెంట్లో మాట్లాడటం తన అదృష్టమని సుదీక్ష ఆనందం వ్యక్తం చేసింది.

