నంద్యాల కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ధర్నా

మంచానికే పరిమితమైన దివ్యాంగులకు నెలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని నంద్యాల కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల JAC ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ JAC నాయకులు నినాదాలు చేశారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రతి దివ్యాంగ కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలన్నారు. 35 కిలోల బియ్యంతో అంత్యోదయ రేషన్ కార్డులు, దివ్యాంగుల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ప్రభుత్వ ఉచిత రుణాలు మంజూరు చేయాలని కోరారు.



