← Back to news

రెవెన్యూ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి: జేసీ

By DK· 20h ago
రెవెన్యూ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి: జేసీ

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రెవెన్యూ శాఖ పనితీరుపై జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రెవెన్యూ విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశమైన ఆమె.. శాఖాపరమైన పనులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందించే సేవల్లో జాప్యం లేకుండా పారదర్శకంగా, వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. రీసర్వే, ROR, ల్యాండ్ మేటర్స్, భూవివాదాల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

More in Local