← Back to news

ఇన్‌స్టా రీల్ చూసి నకిలీ కరెన్సీ దందా

By Vishi· 2h ago
ఇన్‌స్టా రీల్ చూసి నకిలీ కరెన్సీ దందా

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన కూరగాయల వ్యాపారి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చూసి నకిలీ కరెన్సీ దందా గురించి తెలుసుకున్నాడు. టెలిగ్రామ్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. మండదుంగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నకిలీ రూ.100, రూ.500 నోట్లను ముద్రించడం మొదలుపెట్టాడు. పోలీసులు అక్కడ సోదాలు చేపట్టారు. నోట్లతోపాటు సీపీయూ, మానిటర్, రెండు ప్రింటర్లు, లామినేటర్ హీటర్ మెషీన్, బటర్ పేపర్, నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు.

More in National