← Back to news

పేరెంట్స్ కఠిన వైఖరి.. పిల్లల స్కూల్‌ హాజరుపై ప్రభావం!

By Anusha· 1h ago· Thejournal
పేరెంట్స్ కఠిన వైఖరి.. పిల్లల స్కూల్‌ హాజరుపై ప్రభావం!

తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా వ్యవహరించడం, ఇంట్లో సరైన రోజువారీ అలవాట్లు లేకపోవడం వల్ల స్కూల్‌కు ఆబ్సెంట్స్ పెరిగే ప్రమాదం ఉందని ఐర్లాండ్‌ ESRI రిపోర్టు తెలిపింది. 9 నుంచి 13 ఏళ్ల పిల్లలపై ఈ స్టడీ చేశారు. పిల్లలు రాత్రి 11 తర్వాత నిద్రపోవడం, తరచూ టిఫిన్‌ మానేయడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పేరెెంట్స్ గొడవలు.. పిల్లలపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. స్కూల్‌పై ఆసక్తి లేకపోవడం, తోటి పిల్లల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఆబ్సెంట్స్ పెరగడానికి కారణాలని స్టడీ తెలిపింది.

More in Politics