← Back to news

మొలగవల్లిలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

By DK· 15h ago
మొలగవల్లిలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన పెంచేందుకు కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషకాహార ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ANMలు, ఆశా కార్యకర్తలు, ఆయాలు పాల్గొని సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. శరీరానికి అవసరమైన విటమిన్లు అందేలా వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. గుడ్లు, పాలు, కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని అవగాహన కల్పించారు.

More in Local