OTTలోకి మెగాస్టార్.. నెట్‌ఫ్లిక్స్‌తో పాడ్‌కాస్ట్?

మెగాస్టార్ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పాడ్‌కాస్ట్ షో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట చిరంజీవి జీవితంపై డాక్యుమెంటరీ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించినట్లు అయితే, పాడ్‌కాస్ట్ రూపంలో ప్రేక్షకులతో మాట్లాడేందుకు చిరంజీవి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ షోలో సినీ ప్రయాణం వ్యక్తిగత విషయాలను చిరంజీవి పంచుకోనున్నట్లు తెలుస్తోంది.



