స్కూల్ రూమ్‌లో హాస్పిటల్!

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్‌లోని ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్‌కు ఇప్పటికీ సొంత బిల్డింగ్ లేదు. గ్రామం నుంచి మున్సిపాలిటీగా మారినా పరిస్థితి మారలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చుట్టుపక్కల ఊళ్ల ప్రజలకు వ్యాక్సిన్లు, మందులిచ్చే ఈ సెంటర్.. ప్రస్తుతం స్కూల్లోని ఒక క్లాస్‌రూమ్‌లోనే నడుస్తోంది. తాగునీరు, బాత్రూమ్ సౌకర్యాలు లేక ఆశా వర్కర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫార్మా కంపెనీలు CSR నిధులతో భవనం నిర్మించి సమస్య తీర్చాలని కోరుతున్నారు.


