బ్యాడ్ టీచర్ సస్పెండ్.. విద్యార్థులతో..!

AP: ఏలూరు జిల్లా.. నిడమర్రు మండలంలోని ఓ ZP స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, విద్యార్థినులతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు DEO వెంకట లక్ష్మమ్మకు కంప్లైంట్ చేశారు. దీనిపై DEO విచారణ చేయించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై విద్యా శాఖకు ఆలస్యంగా సమాచారమిచ్చిన హెడ్ మాస్టర్‌కి షోకాజ్ నోటీసు జారీచేశారు. ఇలా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులే ప్రమాదకరంగా మారుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.


