పేకాట స్థావరంపై పోలీసులు పంజా..!

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామ సమీపంలోని గుట్టపై పేకాట కొట్టు ఉంది. దానిపై ఎస్సై పల్లెల ప్రదీప్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు పట్టుబడ్డారు. మరో ఆరుగురు పరారయ్యారు. పోలీసులు వారి నుంచి 52 పేక ముక్కలు, రూ.3,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు బైక్లు, మూడు ఫోన్లు కూడా జప్తు చేశారు. మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మీ ఊర్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా? మీ వార్త పంపండి!




