పేపర్ వేయడంలో ఇతడే కింగ్.. వీడియో వైరల్!
17 ఏళ్లుగా న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తున్న వ్యక్తి టాలెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌పై వెళ్తూనే ఆగకుండా ఇళ్లకూ, బాల్కనీలకు పేపర్లను కచ్చితంగా విసురుతూ డెలివరీ చేస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. 28 సెకన్ల ఈ వీడియోలో అతని స్పీడ్, పేపర్లు వేసే విధానం కట్టిపడేస్తోంది. ఇలాంటి పనిని ఇంత కచ్చితంగా చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ కావాలంటూ నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు.

