← Back to news

వినాయక విగ్రహాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి!

By SUBHANI· 11h ago
వినాయక విగ్రహాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి!

పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి విగ్రహాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. పోలీస్, విద్యుత్, ఫైర్ శాఖల పర్మిషన్ పొందాలని సీఐ మురళి చెప్పారు. విగ్రహ ఏర్పాటు కమిటీలు ఈ నియమం పాటించాలి. నిమజ్జనం తేదీ, స్థలం ముందుగా తెలియజేయాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. నియమాలను ఎవ్వరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని సిఐ హెచ్చరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.