← Back to news

మంత్రి పొంగులేటి పర్యటన.. ఎక్కడెక్కడంటే ?

By Ramesh Kondru· 17h ago· Paleru, Kusumanchi, Khammam
మంత్రి పొంగులేటి పర్యటన.. ఎక్కడెక్కడంటే ?

ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాల్లోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. మొదటగా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని విఘ్నేశ్వరుడి మండపాన్ని సందర్శిస్తారు. అనంతరం గురవాయిగూడెం, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మారుతీనగర్ మండపాల్లో పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాలలోని గణపతి మండపాలను సందర్శించనున్నారు.

More in Local