గుంటసీమ నుంచి కుజభంగి వరకు కొత్త బస్సు సర్వీసు

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం గుంటసీమ నుంచి కుజభంగి వరకు కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. విజయనగరం జోన్ చైర్మన్, అరకు టీడీపీ ఇన్‌చార్జి డా. సియ్యారి దొన్ను దొర సోమవారం ఈ సర్వీసును ప్రారంభించారు. పాడేరు నుంచి అరకు-గుంటసీమ మీదుగా కుజభంగి వరకు బస్సు నడుస్తుంది. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి, తుడుము సుబ్బారావు, కిల్లో ఆనందరావు, పాంగి సుబ్బారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.



