తెలుగు రాష్ట్రాలను కలుపుతూ.. దేశంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి NH-44. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సుమారు 4,113 కిలోమీటర్ల మేర విస్తరించింది. దేశ ఉత్తర–దక్షిణాలను కలుపుతూ పలు రాష్ట్రాలు, బిగ్ సిటీస్, ఇండస్ట్రీ, వ్యవసాయ ప్రాంతాలను కనెక్ట్ చేస్తోంది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా సాగుతుంది. APలో కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా కర్ణాటకలోకి వెళ్తుంది.
