← Back to news

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

By DK· 3h ago
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 16,564 అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందన్నారు.

More in Local