← Back to news

బేతుపల్లి అంగన్‌వాడీలో అక్షరాభ్యాసాలు

By chandrashekar· 1d ago· Bethupalle, Sathupalli, Khammam
బేతుపల్లి అంగన్‌వాడీలో అక్షరాభ్యాసాలు

పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సెక్టార్ పరిధిలోని బేతుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. సూపర్‌వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీడీపీఓ బి. సత్యవతి మాట్లాడుతూ, పోషకాహారం ప్రాధాన్యత, చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరమని తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లల ఎత్తులు, బరువులు కూడా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు కమల, కాంతమ్మ, నాగలక్ష్మి, నాగేంద్ర పాల్గొన్నారు.

More in Local