← Back to news

యుద్ధాలు లేని సమాజం కావాలి: రౌతు అజయ్ కుమార్

By KanniRam· 1d ago· Velair, Velair, Hanumakonda
యుద్ధాలు లేని సమాజం కావాలి: రౌతు అజయ్ కుమార్

హనుమకొండ జిల్లాలో ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా వేలేరు గురుకుల పాఠశాలలో జన విజ్ఞాన వేదిక కార్యక్రమం జరిగింది. జేవీవీ హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ రౌతు అజయ్ కుమార్ మాట్లాడారు. ఆధిపత్యం, ఆకలి, అసమానతలు, యుద్ధాలు లేని సమాజం కావాలని అన్నారు. ప్రపంచం శాంతి, సౌభ్రాతృత్వంతో విలసిల్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ పి. స్వజని అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు కే. మహేందర్, వలిహుస్సేన్ పాల్గొన్నారు. శాంతి, మానవతా విలువలు పెంపొందించాలని పిలుపునిచ్చారు.

More in Local