లింగారెడ్డిగూడలో బస్సులు ఆపాలని వినతి

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో పల్లె వెలుగు బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ ప్రవీణ్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ తెలిపారు. షాద్‌నగర్-హైదరాబాద్ మధ్య నిత్యం పల్లె వెలుగు బస్సులు తిరుగుతున్నప్పటికీ గ్రామంలో ఆపకుండా వెళ్తున్నాయని పేర్కొంటూ డిపో మేనేజర్ కరుణశ్రీకి వినతిపత్రం అందించారు. గ్రామంలో బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటామని, ఇకపై సమస్య పునరావృతం కాకుండా చూస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చారు.



