← Back to news

నర్సంపేటలో కన్నుల పండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి

By srikanth thouti· 2h ago· Warangal
నర్సంపేటలో కన్నుల పండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి

TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డా. వనజ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారని, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మం, స్నేహం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించి, చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాల ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 38m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.