ట్యాంక్‌బండ్‌పై టెన్షన్ టెన్షన్.. ట్రాఫిక్ జామ్
ట్యాంక్‌బండ్ దగ్గర భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనాన్ని నిషేధించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన ఐరన్ బారికేడ్లను బలవంతంగా తొలగించారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ ఆందోళనతో ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనిపై మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.


