← Back to news

మాతాశిశు ఆసుపత్రిని ప్రారంభించాలి: బీజేపీ

By Srikanth Goud· 12h ago· Jagitial, Jagitial, Jagitial

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మాతాశిశు ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాలేదని తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు, అవసరమైన పరికరాలు, సిబ్బంది నియామకాలు, అనుమతుల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలన్నారు.

More in Local