ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసనతో ఉద్రిక్తత

AP:విజయవాడలో ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళనతో కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

