నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రంలో బౌద్ధ ఉత్సవాలు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ క్షేత్రం వద్ద బుద్ధ విహార చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బౌద్ధ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ దివాకర్ టీఎస్, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి దయాకర్తో పాటు వివిధ దేశాల బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని, బౌద్ధ చరిత్ర, అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని సూచించారు.


