← Back to news

తెలంగాణ విద్యాశాఖకు 25 వేల జరిమానా

By Vishi· 10 Oct 2026
తెలంగాణ విద్యాశాఖకు 25 వేల జరిమానా

TG: తెలంగాణ విద్యాశాఖకు హైకోర్టు 25 వేల రూపాయల జరిమానా విధించింది. 250 రోజులు ఆలస్యంగా అప్పీల్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌కు చెందిన గిరీష్ అనే వ్యక్తిని అపాయింట్‌మెంట్ డేట్ నుంచే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఖాళీల్లో కలపాలని 2025లో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. ఆ ఆర్డర్స్ ఇచ్చేనాటికి అతను మరణించాడని, ఏడాది తర్వాత ఇటీవల విద్యాశాఖ అప్పీల్ చేసింది. ఇంత ఆలస్యంగా అప్పీల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జడ్జి జరిమానా విధించారు.

More in TG