బీటీ రోడ్డు కోసం ఎదురుచూపులు..!

మోటకొండూరు మండలంలోని దిలావర్పూర్ నుంచి ఇక్కుర్తికి వెళ్లే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇక్కుర్తి ప్రజలకు ఈ రహదారి ప్రధాన మార్గంగా ఉంది. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


