ప్రమాదకరంగా అంగన్వాడీ సెంటర్.. రిపేర్లు కావాలె

నిర్మల్ జిల్లాలోని కద్దం మండలం కల్లడి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. 7వ వార్డు సభ్యుడు రొడ్డ వంశీకృష్ణ సోమవారం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం దెబ్బతిన్న స్థితిలో ఉంది. పైకప్పు సీలింగ్ పెచ్చులు ఊడిపోయి కడ్డీలు బయటపడ్డాయి. గది నేల గుంతలుగా మారింది. తలుపులు, కిటికీలు చెదలు పట్టి పాడయ్యాయి. దీంతో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.




