← Back to news

క్రీడాకారులకు ఎంపీ అభినందనలు

By DK· 14h ago
క్రీడాకారులకు ఎంపీ అభినందనలు

జాతీయస్థాయి సెపక్ తక్రా పోటీల్లో కాంస్య పతకం సాధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రీడాకారులను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అభినందించారు. ఈ నెల 6 నుంచి 10 వరకు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన 29వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్‌లో కోనసీమకు చెందిన గోసంగి సందీప్, బండారు చంటి, బులా అభిషేక్ ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొన్నారు. వీరు జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాతబాబు తెలిపారు.

More in Local