రాత్రివేళల్లో ఇసుక దందా

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లి శివార్లలో రాత్రిపూట ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ట్రాక్టర్లలో ఓవర్ లోడ్‌తో వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భయపడుతున్నారు. ఇటీవలే ఇక్కడ ఒక ఇసుక ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన జరిగింది. ఇప్పటికైనా అధికారులు రాత్రిపూట పెట్రోలింగ్, నిఘా పెంచి ఈ దందాను అడ్డుకోవాలని ఊరి ప్రజలు కోరుతున్నారు.



