చెన్నారావుపేట ఎస్సైగా గోవర్ధన్

వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై రాజేష్రెడ్డి మిల్స్ కాలనీకి బదిలీ కావడంతో, హనుమకొండ టౌన్ నుంచి గోవర్ధన్ వచ్చారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. జూదం, అక్రమ మద్యం విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.


