← Back to news

హాలిడేస్‌లో తరగతుల నిర్వహణపై విచారణ జరపాలి

By Ashok Ganapuram· 8h ago· Mahabubabad

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు చంటి ఆరోపించారు. విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కోరారు. పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అడ్డుకుని, గేటుకు తాళం వేసి దురుసుగా మాట్లాడారని తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local