సినీ పరిశ్రమను మొత్తం తప్పుపట్టలేం: అమలాపాల్

దక్షిణాది సినిమాల్లో మహిళలను చూపించే విధానంపై నటి అమలాపాల్ స్పందించారు. ఈ విషయంలో మొత్తం సినీ పరిశ్రమను తప్పుపట్టలేమని ఆమె అన్నారు. 2019లో వచ్చిన ‘ఆడై’ సినిమాలో నగ్నంగా నటించడం తన కెరీర్లో సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు. ఆ సన్నివేశం కేవలం ప్రచారం కోసం కాకుండా కథకు అవసరమా అనేదే తనకు ముఖ్యమన్నారు. ఇప్పుడు అదే అవకాశం వస్తే ఆ పాత్రను చేయకపోవచ్చని చెప్పారు.



