← Back to news

తమిళనాడులో జెన్ జీ టార్గెట్ గా అన్నామలై కొత్త పార్టీ?

By DS· 1 Jun 2026· Ndtv· tamilanadu
తమిళనాడులో  జెన్ జీ టార్గెట్ గా అన్నామలై కొత్త పార్టీ?

తమిళనాడు బిజేపి మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త రాజకీయ వేదిక ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన పుట్టిన రోజైన ఈనెల 4న ఆయన ఈ అనౌన్స్ మెంట్ చేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. బీజేపితో తలెత్తిన విభేదాలు, తనను అధ్యక్ష పదవినుంచి తప్పించడం, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల విషయంలో కూడా అభిప్రాయ బేధాలు రావడంతో అన్నామలై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జెన్ జీ టార్గెట్ గా అడుగులు వేయనున్నట్లు, ఈ రాజకీయ వేదికనే ఫ్యూచర్ లో పొలిటికల్ పార్టీగా మారుస్తారని టాక్ నడుస్తోంది.

More in Politics