ఆక్వా యూనిట్లపై పవన్ కల్యాణ్ ఆదేశాలు

AP: ఆక్వా యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలు నదులు, కాలువలు, భూగర్భ జలాల్లో కలవకుండా చూడాలని AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. 119 ఆక్వా ప్రాసెసింగ్, 12 ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లలో రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. 82 యూనిట్ల నుంచి శాంపిల్స్ తీసుకుని చెక్ చేయగా.. 10 యూనిట్లలో సమస్యలు గుర్తించారు. దీంతో వాటికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రెండు వారాల్లో సమస్యలు కరెక్ట్ చేసుకోవాలని అధికారులు చెప్పారు.



